పుట:2015.333901.Kridabhimanamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంధపాతములచే నాపద్యము జాఱిపోయియుండవచ్చును. పయి తాటాకుపుస్తకమును వ్రాసినకాల మగువరీధావి వత్సరము డెబ్బదియైదేండ్ల క్రిందిటిదిగాక యంత కఱువది యేండ్లకు బూర్వపు బరీధావి యగును.

     శ్రీనాధుడు పల్నాటివీరచరిత్ర ద్విపదప్రబంధమును రచియించెను.  క్రీడాభిరామము (116 వ)న ద్విపదపల్నాటి వీరచరిత్రప్రశంస గలదు.  మఱియు దత్కధావిసేషవర్ణనము హెచ్చుగా గలదు.  తన కాకధమీది యాదరముచే దద్వర్ణనముజేసి యుండవచ్చును.
      శ్రీనాధుడు సాతవాహనసప్తశ్తిని దెలిగించెననుట కాక్షేపించువారెవ్వరునుండగూడదు.  'నూనూగు మీసాల నూత్నయౌవనమున సాతవాహనసప్తశతి నొడివితి ' నని కాశీఖండము (1-7)న జెప్పుకొన్నాడు.  ఆంధ్రవిద్వాంసుల యదృష్టలోపముచే నా యాంధ్రగ్రంధ మీకాలమున గానరాకున్నది.  కాని మూల మగుప్రాకృత గ్రంధము సవ్యాఖ్యముగా ముద్రితమై సమకూరు చున్నది.  అందుచతుర్థశతకమున పదునైదవగాధ యీ క్రిందిది:

'ఝజ్ఞావా ఉత్తణిఏ
ఘరమ్మిరోఊణ ణీసహణిసణమ్
విజ్జుజ్జోఓ జలహరాణమ్"