పుట:2015.333901.Kridabhimanamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై వాక్యమందలి కడపటిపదము నశ్లీలార్ధమున శ్రీనాధుడే పలుదవడలు ప్రయోగించినాడు.

‘వుద్వజ్ఞమలు నిన్ను విషయించి వత్తురు ‘(నైషధము 6-110)
ఉ. గండము దప్పె నాంధ్రకవిగారికి నిన్నటిరేయి పుష్పకో
    దండునికేశ గూడకయ తద్ధయు నిల్పితిగాని యయ్యయో
    బండరువారిపావికిని బైటివాపారమె కాని యందులో
    బుండట యెల్లవంశ జెడిపోదుగదా విషయింపబోయినన్.

ఈ పై పద్యము శ్రీనాధుని చాటుధార యని సి.పి.బ్రౌను దొరగారు సేకరించిరి.

‘అయ్యవారికి జోహారు అనుచు ంరుక్కె ‘. (క్రీడా. 186)
 
‘అయ్యగారికి నమస్కారంబు అని ‘. (శివరాత్రి. 30-38)
‘వేశ్యాజనంబునకు వావివరుస యెక్కడిది ‘ (క్రీడా.252 వ)
'వారకాంతాజనమునకు వావి గలదె ' (హర. ?)
'పులుగురాయని తాత్కాలపుణ్యభిక్ష ' (క్రీడా. 221 వ0
పొసగ వడ్డుంచె దత్కాలపుణ్యభిక్ష ' (హర 5-48)
'పురములో దత్కాలపుణ్యభిక్ష ' (భీమ. 3-7)
'కసటు వోపగ దోమి కడిగి బోరగిలంగ ' (క్రీడా 80 వ)
'కసటువో దెలినీట గడిగి యీటార్చిన ' (హర. 7-110)
'గోధూళీలగ్నంబున నార్యవాటిక బ్రవేశించి ' (క్రీడా. 272 వ)
'గోధూళీలగ్నంబునం బురంబు బ్రవేశింపవలయును ' (క్రీడా. 65 వ)