పుట:2015.333901.Kridabhimanamu.pdf/306

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                                        కామమంజరి 83
మరుపెం బొప్పగ వచ్చె జౌర్యరతసం
              భోగార్ధమై కామమం
జరి గోవిందునియొద్దకున్ శివనమ
                స్కారచ్చలం బొప్పగన్ 282
క. మోదంబున రాకచం
   ద్రోదయదేవతయుబోలె నొయ్యన జన శా
   తోదరి గోవిందుని శ్రీ
   పాదంబుల కెఱగె భక్తిభయలజ్జలతోన్. 282
ఉ. మచ్చికయుం బ్రేమోదమును
         మన్ననయున్ నయమున్ విలాసమున్
   మెచ్చును నేర్పడం దనకు
       మే దిడి ంరొక్కినకామమంజరిన్
 గ్రుచ్చియు గౌగిలించె సరి
     గుబ్బచనుంగవరేండుక్రేవలన్
 బచ్చనివింటిజోదు వయి
      పై బులకంబులు నారువోయగన్. 283
వ. అనంతరం బాసనాసీను లైన నగ్గోవిందుండు కామ
    మంజరిం జూచి. 284
మ. అరవిందాస్య ! తలంచి చూడ నిది య
                  త్యాశ్చర్యమో కాని నీ