పుట:2015.333901.Kridabhimanamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'అఖండలదిశావేదండకంఠగ్రైవేయఘంటికాటంకారంబు
నుంబోలె ' (భీమ.2-101)
'కరిఘటాగైవేయఘంటికాటంబులం బ్రోధిసేయుచు ' (నైషధము 6-80)
ఈసమాసము భట్టబాణునిరచనలో గలదు. శ్రీనాధుడు దీని నింకను బెక్కుచోట్ల ననుకరించెను.
'చాంవేయకుసుమచ్చరచ్చాయాదాయాదంబులైన ' (క్రీడా. 273 వ)
కఠోరపాఠీనచ్చాయాదాయాదంబులైన ' (భీమ.2-110)
సుకుమారశుకచ్చదచాయాదాయాదంబులైన '  ?
కనత్కనకన్ఖశలాకానికాయచ్చాయాదాయాదంబు ' (భీమ. 3-212)

ఇట్టి వింకను బెక్కులు గలవు.
ముఖర వీణాక్వాణపాణింధమం బైనమధురస్వరంబున ' (క్రీడా. 100 వ)
కలంధురవీణాక్వాణపాణింధమం బైయెలుగెత్తి ' (భీమ. 2-110-0
'కాలకూడాచ్చాయాపాణింధమంబైన ' (కాశీ. 4-118)
'గంధలహరీపాణింధమంబు ' (శివరాత్రి. 4-43)
'సంధ్యారాగంబు నింగి యింగిలికంబునంబెట్టో (క్రీడా. 273వ)
'నింగియింగిలికాన నభ్యంగ మర్చే ' (కాశీ. 1-124)
ఇట్టి వింకను బెక్కులు గలవు