పుట:2015.333901.Kridabhimanamu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దంబు లిన్నియుం జూడం దలంచితిమేని కామమంజరీ గృహప్రవేశంబునకుం గార్తాంతికుందు వెట్టిన ముహూర్తంబు సరిగడచు నిపుడు పుష్యనక్షత్రంబున నాల్గవ పాదంబు నడచుచున్న యది కాలావర్తవిషనాడికా స్పర్శనంబు లేక యమృతద్వంద్వంబు గూడి యిందుబింబాననాధరోష్ఠవల్ల నామృతపరణలాభంబునకుకుం గారణంబు గా గలిగి యున్నయది యివ్వేశవాటంబు వీధిఈ విటంకం బతిక్రమించి వేవేగం జనవలయు నిదె యటాది యొక సురపొన్నక్రీనీడ క్రీడాభరంబున గన్నియలం గూడి కందుకక్రీడ యెనర్చుచున్నయది దీని నలవోకవోలె నైనం జూడవలయు నని చూడంజని.

                                    బంతులాట
శా. పంచారించినలేతచన్నులపయిం
               బ్రాలంబముల్ గ్రాలగా
  గాంచీనూపురకంకణక్వణముల్
         గర్జింప బాలాజనుల్
  కించిన్న్యంచదుదంచితక్షమముగా
        గ్రీడించెద ర్చూడుమా!
  చంచత్కాంచనకందుకత్రయములన్
       నవ్యాపనవ్యంబులన్ 258