పుట:2015.333901.Kridabhimanamu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ననుభవింపుడు నీవు మదాలసయును
నరసంసార మింతయు వధ్రువంబు. 245
గీ. మిన్న కున్నార లిద్ యేమి మీరు ముగురు
    నీగకుసు లోక వెట్టినయిట్టిభంగి
    హెచ్చుగుం దింతమాత్ర మెదేని గలదె
    ముగుల గోపంబు మీకు లేమియును దోచె. 246
వ. అనిన మధుమావతి గోవిందహంచనశర్మతో నిట్లనియె.
సీ. ఏమి చెప్పుదుము మాకీవు త్రోబుట్టుగ
         వైనసుం జెప్పక యడవరాదు
   నీదువియ్యంకుండు నిర్భాగ్యు డీతండ
        యీపోయినట్టిరే యేకతమున
   మామదాలస కేళిమందిరాంతరమున
       హంసతూలికపాన్పు నందు నొంటి
  నిద్రించి యుండగ నీవిబంధం బూడ్చి
            యటు చేయవలసినయట్టు చేసె
  మధుమదారంభమున మేను మఱచి యపుడు
  మోసపొయితి మీనాడు ముట్ట దెలియ
  జెలియలికి నాకు గొడ్డేఱ కలక పుట్టె
  బ్రాహ్మణుడె వీడు విశ్వాసపాతకుండు. 248