పుట:2015.333901.Kridabhimanamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                  నాగసౌరము 69
     (ఇక్కడకొంత గ్రంధపాతమై యుండును.0
వ. అనిన గాంధర్వి పరదేశపట్టణంబుల వితంతువులచేత
    వక్ష:కుట్టనంబు నెయించుకొన మరిగి నీవెట్టు మమ్ముం
   దలంతు పదపద విచ్చేయు మనుచు నీర్ష్యాకుటిలం
   బగుకటాక్షంబునం జూచిన 216
చ.లవలన జన్నుదోయి గద
        లన్ దొలుకారుమెఱుంగుదీగలం
   గవకన నవ్వుడాలుదెలి
        కన్నులమించులు చౌకళింపగా
   నవనవయౌవనంబు గల
           నాటిభవత్పురుషాయితోద్ధతుల్
   శివశివ యెన్నిభంగులను
         జిత్తములో మఱవంగ వచ్చునే? 217
వ.కార్యాంతరవ్యాసంగంబున నార్యనాటికిం బోవుచున్న
   వాడ మనమదనరేఖాకన్య దర్పణానలోకముహూర్తంబు
   సుముహూర్తం బయ్యెడు బోయివచ్చెద నని. 218
                              సాగసారము
గీ. వెడలి పశ్చిమదిశ నాల్గుగడియ లంత
    ప్రొద్ధు గలుగంగ నడువీధి బోయి పోయి
    కేళిసఖుడును దా నాలకించి చనియె
    నాగసౌరములమ్రోత యన్నాగరికుడు. 219