పుట:2015.333901.Kridabhimanamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                   అక్కలు 43

మంచుకుంచాల గొలువంగ మాయలేళ్ళ
బట్టి కట్టంగ నేర్పినబాసవెల్లి
భైరవునితోడిజోడు మైలారదేవు
డోరుగంటినివాసి మేలొసగు గాత. 145

మ. అదిగో! యెత్తినవారు పట్టణము ను
    ధ్యక్షోణి సింహధ్వజం
    బదిగో! కట్టినవారు వింబదళమా
        ల్యాతోరణవ్రాతముల్
    విదితం బయ్యె మహోత్సవంబు నెఱయున్
         వీధివిటంకంబులం
    దదిగో! నిల్చినవారు పూర్ణకలశం
          బాబాలవృద్ధాంగనల్. 146

మ. అకలంకస్థితి శీధుపానరుచులై
          యాపారు లుప్పొంగి యొ
    యకరో యమ్మకరొ యమక్కరొ యదీ
         యట్టట్టకో యంచు బా
    యక తప్పెట్లును దళ్ళెతాళములు నిం
           పై సొంపు రంజిల్లగా
    జకజుంజుం జకజుంజు జుమ్ము మనుచున్
           పాగుం గడున్ వాద్యముల్. 147