పుట:2015.333901.Kridabhimanamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా. మౌళిం గోహళి సంఘటించినక్రియన్ మధ్యాహ్నవేళన్ మహా
     కాళంబైన నభోవిభగమున వీకం గానె నీరెండ యా
     ప్రాలేయాహిత సంప్రదీప్త కిరణప్రక్రీడ దర్కోపల
     జ్వాలాజాలజటాల జాంగలతటీవచాలకోయుష్టియై. (హర.7.108)
పయిరెందు పద్యములలోని 'ప్రక్రీడాదర్కోవ ' లేత్యాదిసమస్తపదసంవిధానము కట్టమురారిప్రణీత మగుననర్ఘ రాఘవనాటకమందు గలదు. శ్రీనాధుడు భవభూతి భట్టమురారి నాటకములమీద నభిమానము మెండు. వారి నాటకములలోని రచనముల బెక్కుచోట్ల నాతడు పుడికిపుచ్చుకొన్నాడు.
శా. ఉద్దామద్యుమణిద్యుతివ్యతికరప్రక్రీడదర్కోపల
     జ్వాలాజాలజటాలజాజ్గలతటీనిష్కూలకోయన్టయ:;
     భౌమోష్ణ ప్లవమానసూరికిరణ క్రూరప్రకారా దృశొ
     రాయష్కర్మనమాచయన్తిధి గమూర్మధ్యాహ్మకూన్యాదిశ:
                                               (అనర్ఘరాఘవము.2-3)
మఱియు,
స్రగ్ధర, వ్యామగ్రాహ్యస్తనీభి శ్శబరయునతిభి: కౌతుకోదంచదక్షం
       కృచ్చ్రాదన్వీయమాన: క్షణ మచల మసౌ చిత్రకూటం ప్రతస్థె.
                                            (అనర్ఘరాఘవము. 5.2)
శా,అనుత్రావరుణాంశసంభవుని వింధ్యాటోపవిధ్యంని లో
    పాముద్రాసహితుం గనుంగొనిరి యుత్పన్న ప్రమోదంబునన్