పుట:2015.333901.Kridabhimanamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                             మాలెక
మ. అలరుంబోది జనంగమప్రమద మ
               ధ్యానద్దఘంటాద్యనుల్
   చెలగం బాడె సమస్తలోకజననిన్
              శ్రీయేకవీరాంబికన్
   వలరా జొక్కొకమూర్చనాస్వరమునన్
          బ్రాణంబు గల్పింపగా
   గలకంఠీకలకలఠకోమలకుహూ
        కారంబు తోరంబుగన్ 131

మ.అకలంకస్థితి గోరి కాల్చెద్రు బ్ర
              హ్మానందభావంబునన్
   సకలానందమయైకమాత లగుచున్
      సంతోషచిత్తంబునన్
   తకదుమ్ముల్ యకతాళముల్ జవనికల్
       తందాన లమ్మయ్యకున్
  ఏకవీరమ్మకు మాహురమ్మకు నధో
      హ్రీంకారమధ్యాత్మకున్ 132

శా. ఆలోకింపక మ్రొక్కరాదు నిజభ
            క్త్యావేశసంపత్తిమై
  నాలోకీంచిన జిత్త మెట్లగునొ కా
            మావేశసంయిక్తిమై