పుట:2015.333901.Kridabhimanamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ. ఆరువల్లినాయి *నారిదుర్మంత్రంబు,
   కోడిపోరు, చాపకూటికుడువు
   ప్రధమకారణములు పల్నాటియేకాంగ
   వీరపురుషసంప్రహారమునకు 119

ఉ.పచ్చనిపిండిగందమును
         బాలము నేనయు నెఱ్ఱపూవులన్
   గ్రుచ్చిన కంఠమాల్యములు
            గొప్పుగ నల్లినవేణీబంధముల్
  కుచ్చులవీరసంబెటయు
            గ్రొత్తమణుం గగుకానెపుట్టమున్
   ఱచ్చల కెక్కినట్టిరన
           ణంబులు వీరకుమారకోటికిన్ 120

క. నల్లంగొండయు నాగరి
   కల్లును ధరణీస్థలిం బ్రగల్బస్థలముల్
   పల్లేఱు నాగులేఱును
   బల్లెక్ష్మాకాంత యెల్లప్రారంబంబుల్ 121

సీ. ఇచ్చోట భుజియించి రేకకార్యస్థులై
           సామంతనృపతులు చాపకూడు
   ఇచ్చోట జింతించె నిచ్చ నుపాయంబు
          నశినాక్షి యార్వెల్లినాఉరాలు


  • యురాలి అని యుండవచ్చును.