పుట:2015.333901.Kridabhimanamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. రాజమార్గంబు వారణఘటా ఘోటక
              శకటికాభటకోటిసంకులంబు
    ధరణీస్థలీరజస్త్రపరేణుబహుళంబు
             గావున మన మందు భోవలదు

  క్రంతత్రోవల నొండుగలకలంబులు లేవు
       తఱచుగా సుకవినోదములు గలవు
  మఱియు విశేషించి మన్మధకూట మౌ
       వేశవాటిక మధ్యవీధి దఱిసి
  చిత్తమున కెక్కినట్తిలంజిఅలతోడ
  సరససల్లాపసౌఖ్యంబు సలుపవచ్చు
  నంత మధ్యాహ్నసమయ మౌనపుడు గాని
  వేడుకై యుండ దక్కలవాడ సొరగ. 114

గీ. అనిన డిట్టిభు డౌ నంచు ననుచరింప
   నాలువరిక్రిందిత్రోవగా నరిగి యరిగి
   విప్రు డీక్షించె బలినాటివీరపురుష
   పరమదైవతశివలింగబవనవాటి 115

               పల్నాటివీరులకధ
మ. ద్రుతతాశంబున వెరగుంభితకదుం
            ధుంధుంకిటాత్కారసం
   గతి వాయింపుచు నాంతరాళికయతి
                    గ్రామాభిరామంబుగా