పుట:2015.333901.Kridabhimanamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. మీనవిలోచనంబులును
             మీటిన ఖం గనుగుబ్బచన్ను లిం
   పైనవచోమృతంబు సొగ
           సైన మదాలసమందయానముం
   గా నొనరించి దీని గణి
           కామణి జేయక నిర్ణయాత్ముడై
   గానులదాని జేసినవి
         కారవిధిం దలమొత్తగా దగున్ 104
వ.అట యుత్తరంబునం గత్తెరనొత్తి పెక్కువన్నెల పొత్తుల
   బహువిధవర్తనల హత్తించి యెత్తి కట్టిన పూగొత్తులు
   మత్తకోకిలకలహంసదాత్యూహవ్యూహంబులుం గలిగిన
మొహరివాడ* యందు. 105

                           కుట్రపువాడు

చ.కొలుచును జేనవెట్టి కుచ
                  కుంభయుగం బెగడిగ్గ గన్నుగ్రే
   వల బరికించు గక్షముల
            వైచును సృష్టులు మాటిమాటికిం
  గలికితనంబునం దఱచు
            గా నగు సౌచికవల్లపుండు గం
  చెల వెప గుట్టి యీడు వెల
               చేడియకున్ విషయాభిలాషియై 106


  • చూ. అనుబంధము