పుట:2015.333901.Kridabhimanamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంగాళముగ బింజె సవరించి కట్టిన
       మడు గొంటిపొరను లోదొడలు మెఱుయ
బలితంపునిచ్చుటాకులదుద్దుగమ్మలు
       నిద్దంపుజెక్కులమీద జూడ
నోరుగంటిపురంబులో నోరగ్రంత
బెద్దయెలుగున నమ్మె సంపెంగనూనె
కోకిలము పంచమశ్రుతి గొసరినట్లు
కనుమయవ్వలిదేశంబు కరణకాంత 101

                     గానులకన్నె

గీ. పలికినప్పుడు తేనియ లొలికిపడెడు
   జళుకుజూపు గ్రొమ్మించు లులుకుపడెడు
   ములికినాటిది కాబోలు జెలి కిరాట
   కలికి చిలుకలకొలికి యీ తెలికిజోటి 102

ఉ. ఈనళినాక్షి దా దిరువు
            టెద్దుప్రతొదము మోసి రొప్పుచున్
   గానుగపట్టెపై దిరుగ
            గట్టిడి టిట్టిబః మందరాద్రిమం
   ధానకమధ్యమానతిమి
           ధామజలభ్రమిమండలం బధి
   ష్ఠానముగా బ్రమించునల
           సంపదచేడియ బోలకుండునే 103