పుట:2015.333901.Kridabhimanamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా. సంగాసంగ జయాజయంబు పరిహా
               స ప్రస్పుటాశ్లీల భా
    షాంగం బాకలితాంతరావలయక
                క్ష్యాభాగముద్ర్రలన
   ద్భంగీనిష్ఠితకాష్ఠశంకుకము పా
             పద్యూత మీపన్నిదం
   బంగీకారము వేయువారి మొలలం
              బ్రాపించు గౌపీనముల్ 98

గీ. నీకు నౌ నీకు నౌ నంచు నెమకి నెమకి
    ముగుద లగువారి భ్రమియించి మోసపుచ్చు
   బశ్యతోహరు డత్యంతపాపబుద్ధి
   పట్టణములో దగుల్పరిపందెగాదు 99

                          కరణకాంత

సీ. విజ్జోడువడ విడ్డ వెండ్రుకజందెంబు
            వలిగుబ్బపాలిండ్ల కెలకు లొరయ
    గరమూలమున వెండి మొరవంకకడియంబు
             మూడుమూలలలింగముద్ర లొత్త