పుట:2015.333901.Kridabhimanamu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూడకుండిన నేమి సొబగుఱెప్పల మించి
              తేటవాల్మెఱుంగులు దిచ్చరించె
జాటు చేసిన నేమి చక్రవాకుల బోలు
             పాలిండ్ల మొఱుగులు బయలుపడియె
సిగ్గు నతియించి మావేడ్క చిన్నబుచ్చి
యేల యిటు పిసాశించె దిం దేమి సిద్ధి
కాముసామ్రాజ్యపట్టంబు గట్టి నన్ను
గౌగిలింపంగగదవె యోకరణకాంత 95

వ. అని చిఱునవ్వు నవ్వుచు గోవిందమంచనశర్మ నర్మ
    సఖుండును దామను నట పోవబోవ ముందుట. 96

                           జూదము

మ. పరివేష్టించి ప్రజాకదంబకమౌ పై
              పై వ్రాలి వీక్షింపగా
    బరహస్తంబున నొత్తుకాండ్రు నపలా
            పప్రౌఢి బోధింప భా
   మరులై పన్నిద మాడి యోడి మఱి దు
            ర్మానంబుతో నాటగొ
   ల్పిరి వేశ్యావలయాభిసంపశిత ము
               వ్విళ్ళూర్చె గోవిందునిన్ 97