పుట:2015.333901.Kridabhimanamu.pdf/237

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యట పొవంబోవ ముందంట వెలిపాశెంబు మధ్య
ప్రదేశంబున హాలికవాటియందునొక్క చక్కని జవ
రాలు కట్టేఱ్ఱతొగరుంగఱ్ఱల యెల్లియయెఱ్ఱ గలనితంబ
భారంబున నమర్చి బాలార్కకిరనసంపర్కంబున
జాంపేయ కుసుమచ్చదచ్చాయాదాయాదంబు లైనయవ్
యవంబులు మిసమిసమెఱువం గుక్కుటాసనంబునం
గూర్చుండి. 81

                             పామరబామ

ఉ.కందుకకేళి సల్పెడుప్ర
          కారమునం బురుషాయితక్రియా
   తాండవరేఖ చూపెడువి
          ధంబున బామరభామ లేతయీ
  రెండప్రభాతవేల రచి
          యించె నితంబభరంబుజన్నులున్
 గుండలముల్ గురు ల్కదల
         గోమయపిండము లింటిముంగిట్న్. 82

వ. అప్పామరబామారత్నంబు నుద్దేశించి. 83

గీ. పొలపములు లెవు కరివంకబొమలయందు
   జిన్నినగవులు లేవు లేజెక్కులందు
   గలికితనములు లేవు క్రాల్గన్నులందు
   గావుటిల్లాండ్ర కిట్టిమౌగ్ద్యముల యొప్పు 84