పుట:2015.333901.Kridabhimanamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ. శీతోపద్రవంబు లేక సుఖనిద్ర యయ్యెనే యని యడిగి
    వేకువ యగుచున్నయది గావున విదియ మనకు
    బ్రస్థానకాలం బవి నిమిత్తం బనుసంధించి 49

                           శకునములు

ఉ. చుక్క యెకింత నిక్కి బల
                సూదనుదిక్కున రాయుచుండుటన్
   జక్కగ వేగ దిప్పుడు ని
              శాసమయం బిది ప్రస్ఫుటంబుగా
   ముక్కని మాటికాటికిని
                  గోటడు వల్కెడు వాకదిక్కునం
   జొక్కటమై ఫలించు మన
                     శోభనకార్యము లెల్ల డిట్టిభా ! 50

క. మాగిలి మాగిలి వృక్షము
    పూగొమ్ముననుండి షడ్జము ప్రకాశింపన్
    లేగొదమనెమలి పల్కెడు
    గేగోయని వైశ్య మనకు గెలుపగు జుమ్మీ 51

గీ. కొనకొనం గోడి యేట్రింత కొంకనక్క
    నమలి యీనాలుగిటిదర్శనంబు లెప్ప
    వీనివలతీరుబలుకు నుర్వీజనులకు
    గొంగుబంగార మండ్రు శాకునికవరుల్. 52