పుట:2015.333901.Kridabhimanamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యమ్మకచెల్ల ! యింక నవ
     యౌవనదర్పనఖంపచంబు లౌ
కొమ్మలచన్నులన్ సరకు
     గో నటు లున్నవివో తుషారముల్. 46

శా. స్థూలద్విత్రిపటావకుంఠనము గ
              స్తూరీరజ: పాలికా
   కాలాగుర్వనులేపనంబులను ను
                ద్ఘాటించి ధాటీగతిన్
  బ్ర్రాలేయంబు దువాళిసేసిన భయ
              భ్రాంతంబులై యూష్మముల్
  వాలాయంబుగ బ్రాకె నంధ్రవనితా
           వక్షోజశైలాగ్రముల్ 47

శా. స్థూలద్విత్రిపటానకుంఠనములున్
               ధూపోషచారంబులుం
   గాలాగుర్వనులేపనంబులు వధూ
             గాఢోపగూహంబులుం
   గేలీగర్భనికేతనంబులును గ
            ల్గెంగాక లేకున్న నీ
   ప్రాలేయాగమ మెవ్విధంబున భరిం
               పన్ వచ్చురా టిట్టిభా ! 48