పుట:2015.333901.Kridabhimanamu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పునర్భవునందు బద్దానురాగుండై కార్యాంతరవ్యాసం
గంబునం దేశాంతరగతుం డైనకాసల్నాటి గొవింద
మదనశర్మనుద్దేశించి యమ్ముద్దియ పుత్తెంచిన యనం బంధీభూతప్రేమసంధుక్షణాగర్భంబైన మదనలేఖ
సందేశపద్ధతి యది పఠియించుచున్నవా డతని కట్ట
నుంగు జెలికాడు టిట్టిబనెట్టి గావలయు నయ్యిరువురు
నాబాల్యమిత్రంబులు వీరి యోగక్షేమంబు లనుసంధిం
చెదంగాక యని నిష్క్రాంతుడయ్యె నిది ప్రసావన. 41

సీ. గన్నెరుబూచాయ కరమొప్ప నీర్కావి
          మరుగుదోవతి సింజ విడిచికట్టి
    గొఱ్ఱంగిపూనీరు గులికి మేదించిన
           గంగమట్తి లలాటకమున దీర్చి
   వలచేత బంగారుజలపొసనముతొడ
           బ్రన్నవిపట్టుతొరము ధరించి
    జఱిగొన్నవెలిపట్టుజన్నిదంబులలుంగ
            యంటులు వాయంగ నఱుత వైచి
    తలుకుచెంగావికోకయు వలుదశిఖయు
    జిగురుబొమ్మంచు పెదవులు చిన్నినగవు
    నంద మొందంగ వచ్చె గోవిందశర్మ
    మాధవునిపట్టి యొసపరిమన్మధుండు 42