పుట:2015.333901.Kridabhimanamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. జనని సంస్కృతంబు సకలంబాషలకును
    దేశభాషలందు దెనుగు లెస్స
    జగతి దల్లికంటే సౌభాగ్యసంపద
    మెచ్చుటాడుబిడ్డ మేలుగాదె 37
వ.నేపద్యమున 38
                        కధాప్రస్తావన
చ. గతిరసికుండ! షట్చరణ!
           గానకళాకమనీయ! యోమధు
    వ్రత ! వికచారవిందవన
          వాటిక నేమిటికింబరిత్యజిం
    చితి పటవీప్రదేశమున
         జెట్టులు నేమలు నేమి గల్గినన్
   బతిచెడి సంచరించెదవు
        ప్రాబడిపొయెనె నీ వివేతమున్ 39
గీ. చేర వచ్చివచ్చి దూరంబుగా బోదు
   డాయవ్త్తు దవ్వు పోయిపోయి
    మాట లింక నేల మాపాలిటికి నీవు
   మాయలేడి వైతి మంచిరాజ ! 40
వ. ఆకర్ణించి సూత్రధారుదు హా ! యే నెఱింగితి నెకసిలా
    నగరంబునం దార్యవటంబునం గామమంజరి యను