పుట:2015.333901.Kridabhimanamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీప్సితము గాంచు దిప్పమంత్రీంద్రతనయు

  • డర్మవణి వల్లభామాత్యు డహరహంబు. 32


                         ప్రేమాభిరామప్రశంస

వ. ఆ మంత్రిశేఖరుండు రావిపాటి త్రిపురాంతకదేవుం డను
    కవీశ్వరుం డొనరించిన ప్రేమాభిరామనటకంబు ననుస
    రించి క్రీడాభిరామం బనురూపకంబు తెనుంగుబావ
    రచియించినవాడు. 33
గీ. ఆత డెంతటివాడు ప్రేమాబిరామ
    మనగ నెంతటియది దాని ననుసరించి
    వీధి యనురూపకము మది నెఱుపు లేక
    తిప్పవిభువల్లభుం డెట్లు తెనుగు జేసే 34
వ. అని యానతిచ్చెదదేని 35
ఉ. నన్నయభట్టతిక్కకవి
         నాయకు లన్న హుళిక్కిభాస్కరుం
   డన్నను జిమ్మపూ?ది యమ
           దాదిపు డన్నను సత్కవీశ్వరుల్
   నెన్నుదుటం గరాంజలులు
           నింతురు జే యని రావిపాటి తి
   ప్పన్నౌయు సంతవాడ తగు
               నాయిటు దోసపుమాట లాడగన్ 36
   


  • "డార్యమణి" అని యుండవచ్చును.