పుట:2015.333901.Kridabhimanamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామము శ్రీనాధకృతముగా దనువాదము పుఇట్టకుండుటకోయనునట్లు శ్రీనాధకవి యనేక స్థలముల నిందు దన తక్కిన గ్రంధముల రచనలను జేర్చెను. ఆ పోలిక లీ గ్రంధము శ్రీనాధకృతమే యని చెప్పక చెప్పుచున్నవి. ఇతర కవికృతులందలి సరస సంవిధానములను గా జేయు దొంగ కవులును గొంద ఱుందురు. వల్లభరాయ డట్టివాడై శ్రీనాధ రచనమల, గొన్నింటిని గా జేసియుండరాదా యనరాదు. గ్రంధ మామూలాగ్రముగ శ్రీనాధరచనగానే కంపట్టుచున్నది. తస్కరకవుల స్వరచన మస్వరచన మస్వరసమై పొందిపొగక తెలియవచ్చుచుండును. క్రీడాభిరామమున బదసంవిధానము, అంవయక్రేమము, కారకప్రయోగవైచిత్రి, పద్యోపక్రమ నిర్వాహములు, ప్రతిపదము శ్రీనాధినిపే రుగ్గడించుచున్నవి. శ్రీనాధుని రచనాచమత్కారముల నెఱిగినవారిది చక్కగా గుర్తింప గల్గుదురు. అదేపనిగా నారంభించినచో గ్రీడాభిరామమందలి ప్రతిపద్యమునందును శ్రీనాధుని రచనావైచిత్ర్యమును బోల్చి చూపనగును. ఆరంభమందలిదే సీసపద్యపుటెత్తుగీతి:-

గీ. ఎవ్వ డాతండు సామాన్యౠషియె తలపం
    దాటకాకాళరాత్రికి దాశరధికి
    గాలకంధరకోదండఖండమనకు
    గార్ముకాచార్యవర్యుండు గాధిమతుడు (క్రీడా. 2 వ)