పుట:2015.333901.Kridabhimanamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీః

క్రీడాభిరామము

కృత్యవతరణిక

గణన కెక్కిన దశరూపకముల యందు
వివిధ రసభావ భావన వీధి లెస్స
యే కవీంద్రుడు రచియించె నీ ప్రబంధ
మనుచు మీ రానతిచ్చెద రైన వినుడు.

కృతికర్త వంశవర్ణన

సీ. అఖిల ప్రపంచంబు నన్యథా కల్పించె
             బటురోషరేఖ సాఫల్యమొంద
ద్రైశంకసంబైన తారకామండలం
             బాకాశ మార్గంబు నందు నిలిపె
మాలినీతీర నిర్మల సైకతములలో
            మేనకాప్సరసతో మేలమాడె
నామ్నాయమాత గాయత్రీమహాదేవి
            బ్రణుతించి బ్రహ్మర్షి పదము గాంచె.

నెవ్వడాతండు సామాన్యఋషియె తలప
దాటకా కాళరాత్రికి దాశరథికి