పుట:2015.333901.Kridabhimanamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇట్లే క్రీడా 170 పద్యమున తాళపత్ర ప్రతిలో నున్న "విద్దికంచి రామాయణము" ను- "కంఠమెత్తి రామా" యని దిద్దిరి. ఉచితమూఅదు 63వ పద్యమున 'పదియార్వన్నెపసిండితీగలగతిన్ బ్రాకెం బ్రభా జాలముల్ ' అని యుండగా వీరు 'బ్రాకం బ్రభాజాలముల్ ' అని దిద్ది వాక్యమును సంశ్లిష్టము గావించిరి. ఉన్ంపాఠమున ళోటు లేనప్పుడు, అధమ మర్ధవిశేషమేని సాధింప గుదురనప్పుడు సంస్కార మనవసరము. ఇట్లే "పూవుంబోడులు లేరే" 169 పద్యమున దుదికి 'సుషమాసౌభాగ్యలక్ష్కిన్ గనున్ ' అని యున్నపాఠమును 'నగున్ ' అని మార్చిరి 'కనున్ ' అని యున్నపాఠమున గల యర్ధసరస్య మీ మార్పున నాకు గానరాలేదు. 'మంచన నింటివో ' 54 వ పద్యమున వీరు శ్రీకవిగారి పాఠమును దృష్టిలోనుంచుకొని 'దమ్మదార ' యను రూపము నుంచిరి. ఇది 'దమ్మదార ' యని కాక 'ధర్మదారనట్టించు ' ననియే బహుధా ప్రయుక్తము. తాళపత్ర ప్రతియందు నిట్లేయున్నది. కవున నది యట్లే యుంచుట పాడి. ఈ పద్యమందే తుదకు 'కాహళిన్ ' అని శ్రీ కవిగారు గ్రహించిన తాళపత్రప్రతిపాఠ మున్నది. ధర్మదారవట్టించుటయే ధర్మకాహళవట్టించుట - చూ. 'ధర్మకాహళ పట్తించి ' (దశకు. 12-67); 'కుక్కుట కంఠకాహళంబులు వట్టించె ' (నైష. 7-198); 'ఆత్మ సంగ్రామ