పుట:2015.333901.Kridabhimanamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"శీతాకాలము" (56), "మాఘమాసంబు" (262) "పరిపాటీ ఖర్ఫఖర్జూ"(110), "దొరసెమౌనందు" (288) మున్నగు (శ్రీ శాస్త్రిగారే తొలుత గుర్తించిన) పద్యములెన్నియో శ్రీనాధుని యభిమానముచేత వాతని కభిమానపాత్రములగు కావ్యమ్లనుండి యనువదింపబడి యిందు చేర్చబడినవి. ఇట్లు రచన పెరుగుట ప్రబంధలక్షణమే. మఱియొక విషయము. మంచనశర్మ 'కర్యాంతరవ్యసంగంబున దేశాంతరగతుం ' డైనట్లు మాత్రమే మూలమున నుండి యుండునేమో, బహుశ: వల్లభాభ్యుదయ కర్తయగు శ్రీనాధుదే వీధీనాటకప్రబంధమున శ్రీకాకుళపుదిరునాళ్లను జూడబొయినట్లుగా జెప్పబడిన విశేషములతో గూడిన కధాబాగమును గ్రొత్తగా సొంతముగా జేర్చికూర్చి నాడేమో. ప్రేమాభిరామము దొరకినపుడుగాని యీవివరములు తెలియరావు.

    5. ఇది నాటకప్రబంధము కావుననె ప్రస్తావనా ప్రసంగములు, సంభాషనలు, నతుల ప్రవేశనిష్క్రమణాదులు సర్వమును నిందున్నవి యున్నట్లే ప్రబంధమర్గమున బొందుపరుపబడినవి.
   ఈ వీధీనాటకమ్నకును, దీని కర్తృత్వమునకును సంబంధించిన ముడులుకొన్ని యింతటితో విడివడిన పనియే భావింతును. సహృదయులే ప్రమాణము.