పుట:2015.333901.Kridabhimanamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనినాడు. తిప్పన్నకృతి తల్లియైన తిప్పవిభువల్లభుని యను సరణము బిడ్డ. తల్లికావున దానికి గౌరవమున్నను అనుభవము విషయమున బిడ్డదే మెలుచేయి. సంస్కృతము మూలమందలి భాషయగుటచేత సామాన్యులకు గ్లిష్టము. దేశభాషలలో దెనుగు లెస్స గావున నీ యనుకరణము కూడ లెస్స యగుగు. దీనిని బట్తి వల్లభరాయ డావీధిని ప్రదర్శనయోగ్య మగురూపకముగా తెలిగించి యుండు ననుకొందురు. శ్రీనాధుని చేత బొగడితలు గాంచిన వల్లభరాయని వాగ్వైభవ మందు కాననైయుండును. వీధిని, "వీధి"గానే మూలము 'ననుసరించి ' 'తెనుగు బాస ' లో (కవితలోకాక ప్రదర్శన కనుకూల ముగా వచనమున గాబోలును!) వల్లభరాయడు రచియించి బ్రదర్శించి యుండును.. ఇందలి రచన యావిషయమును దలపించుదున్నది. అట్లు ప్రదర్శనకు యొగ్యమైన ఆ వీధీనాటకమును వినుకొండ (నాడేయైపోయిన) కవి రచించెను; ఒరుగల్లు (వారేయైపోయిన) విటులగాధ యది; దోరసముద్రపునటులు ప్రదర్శించిరి. తిరునాళ్ల సందర్భమున బ్రదర్శితమైన యూనాటకమును శ్రీనాధుడు దర్శించియుండును. రసావేశమున నట్టి యపూర్వ నాటకానుసరణమునం దభినివేశమును గన్పరచిన వల్లభరాయని