పుట:2015.333901.Kridabhimanamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండ దుర్గాధ్యక్షుడై యుండును. (ఆ సమయమున వేరొక రెవరేని యాదుర్గమును బాలించుచుండి రనుటకు దగిన యాధారేములు లెవు) ఆ మీదటనే బలశాలు రగు రెడ్దిరాజులతో విజయనగరరాజులు బాంధవ్య మేర్పరచుకొనవలసి వచ్చినది. అది నృపనీతి, ఆనృపనీతి నాటిమంత్రిపుంగవులపలుకుబడిచేత నిర్వహింపబడి యుండును. అందుకెనేమో త్రిపురరతిమహాప్రధాను?డు 'నృపనీతివ్యవహారకర్యమేర్పడినతర్వాత రెడ్ది విజయనగరచక్రవర్తులు తమతమ యేలుబడులలో నున్న కొన్నికొన్ని ప్రాంతముల నిచ్చిపుచ్చుకొనుట జరిగినది. బాంధవ్యము దృష్టితోనే ప్రాంత మెవరిక్రిందనున్నను నాడు వారివారికి చెల్లుబడి యగునచుండిన పలుకుబడిమాత్ర మెట్టి యాటంకము నుండియుండదని భావింపవస్సును. ఆ దినములలో దిప్పన వినుకొండలో నెన్నాళ్లుండెనో యెరుగరాదు. బహుశ: హరిహరరాయల తుదిదినములలోనే తిప్పన కుమారుడగు వల్లభరాయుడు మోపూరు పాలకుడుగ నియుక్తుడై యుండును. తొలుత వీరి పూర్వులు మోపూరుప్రాంతమువారైనప్పటికిని చంద్రామాత్యుని కాలమునుండియు విజయనగరరాజులకడ వర్తిల్లుటను బట్టి స్థిరనివాసముగ నేర్పరచుకొన్న వినుకొండతో వీరి సంబం