పుట:2015.333901.Kridabhimanamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాయలు కావచ్చునని తలపువచ్చును. అతని కడ సేనాని గాను, మంత్రిగాను నుండిన లింగన 'హరిహరక్షోణీంద్ర సామ్రాజ్యవర్ధనుడు ' గా బ్రస్తుతు డగుటను బట్టి- యప్పటి సంగమరాజుల సామ్రాజ్యవ్యాప్తి కీతడు తోడ్పడినట్లు తెలియదగును. రెడ్డిరాజుల యేలుబడిలో నుండిన వినుకొండ ప్రాంతమును క్రీ. 1372 నాటికి సంగమవంశీయులు సంపూర్ణముగా వశపరచుకొనిరి. కాని తిరిగి క్రీ.1377 ప్రాంతమున అనవేమారెడ్ది తిరిగి యాప్రాంతమున్ లోబరచుకొనెను. నాటనుండి రెడ్డి విజయనగర రాజుల కాయా ప్రాంతములు గూర్చి తగవు లుండేవేమో. నాడే లింగనమంత్రి రాయలకు సాయపడియుండును. ఇతరరాజులమంత్రు లనెడితారంకీ లింగనమంత్రి చంద్రసదృశుడట. పరాక్రమము మాటటుంచి ప్రతిభచేతనే శాత్రవులను నిస్తేజస్కుల జేయువాడు కాబోలును. ఆ నాళ్లలోనే లింగనసోదరు డగు తిప్పన కూడ రాయల నాశ్రయించి వినుకొంద ప్రాంతములందుండిన రాయల నవరత్నభాండారమున కధికారిగా నుండి యుండును. క్రమమున వీతడును సోదరునివలె తన ప్రతిభా పరాక్రమములచేత రాయలను మెప్పించి మహాప్రధానియై యుండును. ఈ సోదరుల సాయముననే కావచ్చును రెండవ హరిహరరాయలు తిరిగి వినుకొండ ప్రాంతమును క్రీ.1384 ప్రాంతమున జయించగల్గెను. తిప్పన అపుడే విను