పుట:2015.333901.Kridabhimanamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంధమందే లిపిభేదమున రెండువిధముల వ్రాయబడినట్లు 'చంద్రమాంబ ' అని లిపి 'చెంద్దమాంబ ' గా తాళపత్రములందు లిఖింపబడి యది 'పెద్దమాంబ ' అను భ్రమన్ తత్ప్రతి విలెఖకులకు గల్గించియుండవచ్చును. పర్యవసానముగ దీని మాతృకయందును 'బెద్దమాంబ ' యే మిగిలినది. కావున నది 'పెద్దమాంబ ' కాక 'చంచమాంబ ' యనియే నా విశ్వాసము. ఆ చందమంబాత్రిపురాంతకుల గూర్చి యిచట ప్రస్తావింపబడిన కారణమ్ననే 22 వ పద్యమున 'చందమాంబ ' యొక్క కులగోత్రాదికప్రశంస మరల కవింపబడలేదు. ఈ హేతువున దిప్పమంతులిరువురు (తండ్రికొడుకులు) అగుటయు, వారిభార్యలు క్రమముగా పెద్దమాంబ, చందమాంబలగుటయు తొలగిపోవుచున్నది. ఇందు 'చందమాంబ ' ఒక్కతియే తిప్పనార్యుని సతీమణి. ఆమెభర్తగా బేర్కొనబడిన రాయనవరత్నభాండారరక్షకుల్. తిప్పననామాంకితు లిరువురు నొక్కరే యగుదురుగాని భిన్నులుకారు.

                                  కాలము
 క్రీడాభిరామరూపకర్తగా బేర్కొనబడిన వినుకొండ వల్లభరాయుడు శ్రీనాధునకు బూర్వుడున్ గాడు, తరువాతివాడును గాడు.  శాసనచారిత్రికసాక్ష్యము లీతడు సరిగా శ్రీనాధునకు సమకాలికుడని చెప్పుటకు సరిపడియున్నవి.  క్రీడాభిరామరచన కూడా శ్రీనాధరచ