పుట:2015.333901.Kridabhimanamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రముల నన్నిట నంగీకరించియు దుద కొకచోట మాత్ర మంగీకరింపక కొంద రించుక భిన్నముగా దలచిరి (చూ. శ్రీ బండారు తమ్మయ్యగారిపీఠిక -క్రీడాభిరామము, వావిళ్ల వారి ముద్రణము 1953) ఆ విమర్శకుల యభిప్రాయమున గృతికర్త యనబడిన వల్లభుని తాత తండ్రు లిరువురును దిప్పనలే. రాయనవరత్నభాండార రక్షకులే. తాత తిప్పనకు సోదరుడగులింగన వీరహరిహరరాయల సేనాని. అనగా లింగనమంత్రి వల్లభునకు బెదతాత ఇక బెదబుక్కరాయల మంత్రి యయినచంద్రామాత్యుడు వల్లభుని తాత యగు తిప్పనకు ముత్తాత (అనగా తాత తండ్రి) యగును. కాని కొన్నికారణములచేత నే నీ యభిప్రాయముతో నేకీభవింప జాలకున్నాను. శ్రీశాస్త్రిగా రభిప్రాయముతో నేకీభవింప జాలకున్నాను. శ్రీ శాస్త్రిగా రభిప్రాయపడినట్లు లింగన మంత్రిసోదరు డగుతిప్పనయొక్కతనయులు మువ్వురిలో నడిమివాడుగా బేర్కొనబడిన 'మల్లన ' యే వల్లభుడు కాదగు ననియు, నట్లు సంస్కరింపదగు ననియు విశ్వసించుచున్నాను. శ్రీనాధుడును వల్లభరాయడును సమకాలికులై కాలముకూడ నందుకు బొందిపొసగయేయున్నది. దానికి హెతువు లివి:

1. వంశవర్ణనమందలి రచనాసంప్రదాయ మిందుకు దగియున్నది. చూడుడు: