పుట:2015.333901.Kridabhimanamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీ డా భి రా మ ము

     వల్లభరాయనిపేర శ్రీనాధుడు చెప్పిన వీధినాటక ప్రబంధమున వల్లభునిప్రశంస 'మూడు గ్రామగ్రానముల తోడ గూడంగ మొపూరు బాలించె ముల్కినాట.... మనుజమాత్రుండె వల్లభామాత్యవరుడు ' అను సీసపద్యము (క్రీడా. 22) న గలదు.  అందు తొలి నాలుగుచరణములందును గ్రియాన్వితములుగా జెప్పంబదినవిశేషము లన్నియు నా సీసపుటెత్తుగీతిని యత్తదర్ధక శబ్దముచేత సూచితు డగు వల్లభామాత్యునకే యన్వితములగుట శ్రీనాధుని సీసపద్య రచనాసంప్రదాయము.  ఆ త్రిపురాంతకాధీశ్వరునకు, భండార రక్షకునకు బ్రియతనూజుండు, చందమాంబికకు సుతుడు నయి యెవడు-పాలించెనో, పఠించెనో, వరించెనో, వార్త కెక్కెనో- అతడు వల్లభామాత్యవరుడు మనుజమాత్రుండె అని యన్వయమగును.  శ్రీనాధుని సీసపద్యమున నన్వయమిట్లు విస్పష్టముగా నున్నను గొంచ్ ఱేలకో పైవాక్యము లన్నియు వల్లభుని తండ్రియగు తిప్పనకే చెల్లునని భావించిరి.  అది యట్లనగాదు (చూ.పీఠిక పుట 20) క్రీడాభిరామమందలి2, 22 పద్యముల బోలినదే కాశీఖండమున నీ సీసపద్యమును గూడ బరికింపుడు.