పుట:2015.333901.Kridabhimanamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రధమాబహువచనాంత మగు 'పాఱు ' నన్నయాదుల నాటికి బ్రాతిపదికముగా మాఱిన దనవలసి యుండును. మొదటికి నన్నయతిక్కనలును వారి నడిమికాలపువారును నగుకవు లట్లు ప్రయోగించియుండరనియే నా నమ్మకము మఱియు నిక్కడ నింక నొక్కవిశేషము; ఇంతకుముందు ఎఫిగ్రాఫియా ఇండికా XI వాల్యూంలో కీ.శే. హెచ్. కృష్ణశాస్త్రిగారు ప్రకటించిన సత్యాదిత్యచోళుని చిలుముకూరి తెలుగుశాసనమున 'వేవాన్ఱాఱ్శు నిల్పినపుణ్యంబు ' అని చదివిన పట్టునకు అర్ధము బోధపడలేదని శాస్త్రిగారు వ్రాసిరి. అది వారు చదీనట్లేఅయినను లేక 'వేవాన్డూడ్శు ' అని యయినను దానికర్ధము వేయిబ్ర్రాహ్మణగ్రామములని; వే+పాన్ఱు+ఊఱ్శు -వేయి బ్రాహ్మణగ్రామములు. పాన్డు శబ్దమున వకార మరసున్నగా మాఱి బ్రాహ్మణవాచకము గాను, నకారము లోపించి 'పాడు ' అయి బ్రాహ్మణగ్రామ (అగ్రహార) వాచకముగాను నేర్పడియుండవచ్చును. ఇప్పుడు గ్రామనామములు పెక్కులు 'పాడు ' పదాంతములుగా నున్నవి. ఈ 'పాడు ' పదమునకు బూర్వము బ్రాహ్మణాగ్రహారమనియే యర్ధమేమో. నేడు పాడుపదము బహు కాలము గ్రామమున్నచోట బూడిదన్నెగా మాఱిన మంటిదిబ్బపట్టునకు బేరుగా వ్యవహారమున్నది. క్రీ. 6, 7, 8