పుట:2015.333901.Kridabhimanamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుట్టినదో కాని తెలుగున బ్రాహ్మణుడు అను వర్ణమున 'పాడు ' అనియో 'బాడు ' అనియో ఒక పదమున్నది. శ్రీనాధుని క్రీడాభిరామమందలి యీ క్రింది పద్యమును బరిశీలించిన దెలియగలదు.

 వ. 'ఎదురుగా నేతెంచు నొక్క బ్రహ్మణుం గని '
ఉ.వీడిదె తల్లనాకులను...... నీబాడు, పణోవహార
   పరిపాటి గనుంగొనవచ్చు వీనిచేన్. (చూ.క్రీడా>)

    వ్రాతప్రతిలో 'బాడు ' అని కలదు దీనికి 'పాడు ' అని ప్రాచీనరూపము గానవచ్చును.  లేక యిందు 'బాడు ', 'పాడు ' అనుటకు బ్రామాణికపువ్రాత గానవచ్చును.  'పాడు ' శబ్దమునకు బహువచనముము 'పాఱు ' గా గానవచ్చుచున్నది.  ఇట్లనుటకు నె నింతకుముం దుదాహరించిన శాసనములపట్టులే లక్ష్యములు గాజాలును.  తెలుగు ఇకృతులలో పాఱుడు, పాఱుత రూపములుగలవు  గాని యవివెల్ల నర్వాచీనకవులవి.  ఎఱ్ఱాప్రెగ్గడ భారతారణ్యపర్వశేషమునను, హరివంశమునను పాఱువాడు, పాఱుడు రూపముల బ్రయోగించెను. అటుతర్వాతికవులు ప్రయోగించిరి.  కాని నన్నయ్య తిక్క్జనల కృతులలో నా రూపములున్నట్టు నా దృష్టికి గోచరింపలేదు. ఒకవేళ వారట్లు ప్రయోగించినను నేను జెప్పవిషయము నన్నయ కింకను నన్నూఱేండ్ల పూర్వపుది గాన నా కాలమున