పుట:2015.333901.Kridabhimanamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'మోహరివాడ ' న్ 'దోహర్వడ ' జేయవలెనేమో ! 'దోహరులు ' చెప్పులు తోళ్ల కుట్రమే కాక వెలివాడవారికి 'రవికలు ' మొదలగు బట్టల కుట్రము కూడ జేయువారు గాబోలును ! ఇట్తి యాచారము తెలుగునాట గొన్ని యేండ్ల క్రిందేటిగాక సాగుచున్నట్టు వినికి.

                             బాడు - పాడు
   వఱాను - పాఱను అనుటకు స్వర వ్యత్యయముచ్?ఏ వచ్చిన ప్రామాణికరూపము.  'పాఱను ' అనియే ఎక్కు శాసనములందు గలదు.  మఱికొన్నింట 'వఱాను ' కూడ గలదు.  పాఱను=అనగా బ్ర్రహ్మణులను అని యర్ధము.  బ్రాహ్మణునకు అఱవమున 'పార్పాన్ ' అని పేరు.  అనగా 'ద్రష్ట ' 'తజ్ జ్ఞడు ' అని యఱవవా రర్ధము చెప్పుదురు.  అది దేశిపదమని వారందురు.  'పార్పాన్ ' నేడు 'పాప్పన్ ' అని వ్యూవహారమున నున్నదందురు.  తెలుగున 'బాపడు ' అను రూపమున్నది. అది బ్ర్రాహ్మణశబ్ద వికృతియని మన తలపు.  తెలుగులో బ్రాహ్మణ శబ్దపు వికృతి బాపడు అయినట్టే అఱవమున ('జ ' లేదుగాన) పాపాన్ అయి ఆతద్బవ పదమే దేశిపదతాభిమానము గల వ్యాకర్తలచే 'పార్బావ్ ' గా సంస్కరింప బడినదేమో అని నా యనుమానము.  ఇది యిట్లుండె: బ్ర్రహ్మణశబ్దపువికృతిగా బుట్టినదో యెట్లు