పుట:2015.333901.Kridabhimanamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దానదక్క దక్కిన యన్నింటను 'దోహరి ' అనియే కలదు. బ్రౌనుదొరగారును, సీతారామాచార్యులవారున్ 'దాహరి యని గ్రహించి నే జూపిన యాముక్తమాల్యదాప్రయోగమునే యుదాహరించిరి. 'దాహరి - దాసరి ' రూప భేదము అని వారికతలపు - కాని యా పదము 'దోహరి ' యే. ఆముక్తమున - 'దోహరికి - మర-ద్రోహి ' యని 'దో-ద్రో ' యతి సంగతి యుండుట, వ్రాతప్రతు లన్నింట దోహరి యనియే కానవచ్చుట, కాశీఖండమునను 'రోహరి బంటు 'ఉండుట--అది 'దోహరి ' యే యనుటకు సాధకములు, మఱియు బసవపురాణమునను, పండితారాధ్యచరితమునను 'దోహరి కక్కయ్య ' యను శివభక్తునిచరిత్ర మున్నది.

     శివభక్తు లయినమాలలతో ద్విజులు సరిగా రని చెప్పు కధాసందర్భములలో,

"ముక్కంటిగణము దా గక్కయ్య నాగ
  నీర్విజులకు వైరి.....
(విష్ణుమాహాత్మ్యము వర్ణించు పురాణకట్టును ముక్కలుగా నఱకి చంపెను.)--
దోహరి కక్కయ్య మాహాత్మ్య మెఱిగి
 యూహింప భక్తుల నొం డనదగునె..."
                            (బసవపురా. 7. ఆశ్వా.)

అని కలదు