పుట:2015.333901.Kridabhimanamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలదు. రెండవప్రోలరాజు పద్మాక్షీదేవాలశాసనమునందలి జినేంద్రస్తుతిచే జైనమతావలంబకుడని యూహింపబదుచున్నాడు. ఇరువదిరెండవతీర్ధంకరునిదేవి కూష్మాండిని యని జైనగ్రంధములు దెలుపుచున్నవి. వీని నొక దానితో నొకటి ముడివెట్టి కాకతి జైనదేవత యనియు నామెయే కూష్మాండిని యనియు గాకతి యన గుమ్మడి తీగ యనుట దీనిని బలపఱుచుచున్న దనియు వ్రాయుచున్నారు. కాకతి (కాకిత) యనునది జైనదేవత యని యెచటను దెల్పబడియుండలేద్. జైనగ్రంధముల గాకతి యను పేరు గానరాదు. కాకతి యన గుమ్మడితీక నిఘంటువుల గాని మఱి యేయితర గ్రంధముల గాని లేదు. విద్యానాధకృత ప్రతాపరుద్రీయమున "కాకతీయకుల దుర్గాదేవీసమారాధనేనల్ విజయ ప్రస్థానమంగళం కృత్వా" అని కలదు. రత్నాపణవ్యాఖ్యానమున "కాకతి ర్నామ దుర్గాశక్తి రేకశిలాగరేశ్వరాణాం కులదేవతా, సాశక్తి ర్భనీయా అన్యేతి కాకతీయ:" అని యున్నది. క్రీడాభిరామమున నీమె ఏకవీరకు సైదోడని వర్ణింపబడినది. ప్రతాపచరితమున తమ యిలవేల్పయిన కాకితమ్మకు ఉత్సవములు చేయించి "కాకికదేవి వరప్రసాదంబున ఒక్క సుతుని గని కాకితపోల్రాజు అను నామకరణ మొనర్చి" అని వ్రాయబడినది. కలువచేరుశాసనమున గూడనీమె