పుట:2015.333901.Kridabhimanamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. కా క తి*

   ఇది యొక దేవత పేరు.  ఈ దేవత యోరుగంటిని రాజధానిగా జేసికొని యాంధ్రదేశమెల్ల నేలిన యాంధ్ర చక్రవర్తుల కులదైవము.  ఈమె పేరినిబట్టి వారు కాకతీయులయిరని పలువురు తలచుచున్నారు.  కాకతిపురవరాధీశ్వరు లగుటచే గాకతీయనామము వారికి వచ్చియుండునని మఱియొక్కతలపు.  దొరికినసాధనముల నెల్ల బర్యాలోచించి కాకతీయసంచికలో శ్రీయుత కె.రాఘవాచార్యులు M. A., B.L  గా రిట్లు వ్రాసిరి.
    'కాకతీయుల కాపే రెంద్లకు వచ్చినదో, కాకితమ్మ (కాకతమ్మ) యన నెవరో మనము విచారింపవలసియున్నది.  ఈ సంధర్భమున జరిత్రకారుల్ పెక్కువిషయముల నిద్ఘాటించుచున్నారు.  మనకి దెలిసిన విషయముల జర్చించి యామె జైనదేవతయా? కాదా యని విమర్శింపనగును.  అనితల్లి కలువచేరుశాసనమున "కాకత్యా: పరశక్తే: కృపయా కూష్మాండవల్లికా కాచిత్ పుత్ర మసూత దేవత త్కుల మనఘం కాకతీయసంజ్ఞ మభూత్" అని

  • ఈ వ్యాసము శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యవిద్యా పరిశోధాలయపత్రికయందు బ్రకటితము.