పుట:2015.333901.Kridabhimanamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాటిలోని మోపూరి బరిపాలించెను. ఈ మోపూరు ఉదయగిరిసీమలో నున్నది. ఇక్కడ భైరవునికొండ యని గుహాలయము గలపర్వత మున్నది. అందు భైరచ్వస్వామి గలడు. ఈ చ్వల్లభు డాభైరఫస్వామిభక్తుడు. క్రీడాభిరామము కృత్యవతరనిణీకలో నా భైరవస్వామిప్రశంస కలదు గాబోలును. కృత్యూవ్చతరణిక యిప్పుడీపుస్తకమున లోపించినది. ప్రాయికముగా నాటకములు ఏవో దేవోత్సవాసమయములందు బ్రదర్శించుటకై రచింపబడినట్లు ప్రస్తావనలో జెప్పుట సంప్రదాయసిద్ధము. ఇద్ కూడ నట్టి దేవోత్సవసందర్భమున బ్రయోగించుటకై రచింపబడినట్లు ప్రస్తావలో జెప్పబది యుందును. ఆ దేవోత్సవ మీ మోపూరిభైరవుని తిరునాళ్ళయి యుండును. ఇన్ని విషయములను స్ఫురింపజేయునైదిగా బ్రబంధరత్నావ్చళిలో* వల్లభరాయుని వీధినాటకములోని దని యీ క్రింది పద్య ముదాహృతమై కానవచ్చుచున్నది.

సీ. చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు
    విమలదంష్ట్రాప్రరోహములవాని
    బవడంపు గొనలతో బ్రతివచ్చు ననవచ్చు
    కుటిలకోమల జటాచ్చటలవాని


  • 1918 లో ప్రకటితము.