పుట:2015.333901.Kridabhimanamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దోడుపడిరి. వారు గుర్తించిన ప్రకటించిన యాంధ్ర గ్రంధములలో గుమారసంభవము, నీతిసారముక్తావళి, క్రీడాభిరామము ననునవి రత్నత్రయము త్రిపురాంతకోదాహరణం, శ్రీరంగమహత్మ్యము మొదలగునవియు నుత్తమ గ్రంధములు. సంస్కృతమునను వారు చాల విలువగల గ్రంధముల వెల్లడించిరి. వెల్లడించుచున్నారు. సంస్కృతాంధ్ర భాషాభిమానులు వారియెడ జాల గృతజ్ఞలుగావలెను. వారియనుజ్ఞ గొనియే నేనీగ్రంధమును సంస్కరించి యుపోద్ఘాతము వ్రాసి యచ్చున కిచ్చితిని.

 తంజావూరికి బోయి యక్కడ తాటాకుబ్రతిలోని పాఠభేదములను ఇంకను నేవేవో నాకు దోచిన విశేషములను సేకరించి వ్రాసి పెట్టుకొన్న దీనిప్రధమముద్రణపు బ్రతి నొకప్పుడు నేను బెజవాడ కరిగి యక్కడి రామ మోహన గ్రంధాలయమున గోలుపోయితిని.  నేనక్కడ నుండగా దాని ప్రశంస మిత్రగోష్ఠిలో వచ్చెను.  దానిని వారి కప్పుడు చూపితిని.  ఆతెలివిడిచే నెవ్వరో ప్రబుద్ధులు దాని నపహరించిరి.  ఎందఱతోనో చెప్పితిని.  ఎంతో తంటాలు పడితిని గాని నా కది మరల దొరకలేదు.  ఈ పీఠికాంత్యభాగము ముద్రితమగుచుండగా దానినాటిపోకడతీరు గొంత నేటికి దెలియవచ్చిది.  ఏమి లాభము! నే నందుకై మరల దొందరపడి యప్పుడే తంజావూరి కరిగి తునా