పుట:2015.333901.Kridabhimanamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • బంగారుతలుపులు పాయం ధట్టించి

       లావణ్యవిత్త మేలా (మెల్లన్ ?) వ్యయించె(287 వ)

  ఇత్యాదిరచనలసౌభగ్యము సహృయైకవేద్యమే "పేర్చినసందడి" నిత్యాదిసద్యము జుగుప్స గల్గించుచున్నది.  శ్రీనాధు డిట్టిచాటుపద్యముల జాల జెప్పినాడు.  ఇందలి యాతని "యుప్పర మెత్తుట"ను శ్రీకృష్ణరాయాదులుగూడ గూర్చుమొనిరి.
                   అసాధారణ ప్రయోగములు
   శ్రీకృష్ణదేవరాయాదు లీగ్రంధమును బహువారములు పారాయణము చేసి యందలి మేలిపలుకుబళ్ళను తమ గ్రంధములలో సమకూర్చుకొన్నారు.  శబ్దరత్నాకరకారుల కీగ్రంధము దొరకలేదు గాన యిందలి యసాధారణప్రయోగములను వారు సేకరింపజాలరయిరి, వాని యితరకప్యను కరణములను, అర్ధములను నిక్కడ చూపుదును.

  • ఈ పద్యమునకు మూల మనదగు శ్లోకమిది చూ.

      "లావణ్య ద్రవిణ వ్యయో నగణిత: క్లేశో మహావర్జిత
       స్వచ్చందం దరతో జనన్య హృదయే చితాజ్వరో విర్మిత:
       ఏషాసి వ్వగుణానురూపరమణాభావాడ్వరాకీ హతా
       కోఒర్ధశ్చేతసి వేదపా వివిహిత న్తవ్వీ మిమాంతంవతా."

(చూ. ద్వన్యాలోకము - తృతీయాద్ద్యోతము. ఆసందవర్ధనుడు దీనిని ధర్మకీర్తి రచనగా బేర్కొనెను.)