పుట:2015.333901.Kridabhimanamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దగ్గుబల్లి దుగ్గన, తెనాలిరామకృష్ణుడు, రాధామాధవుడు, పింగళి సూరన మొదలగువారు శ్రీనాధరచనలు బుడికిపుచ్చుకొనిరి.

మ. హరచూడాహరిణాంకవక్రతయు గాలాంతస్ఫురచ్చండికా
     సరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్
     సరసత్వంబును సంబవించె ననగా సత్కావ్యముల్ దిక్కులన్
     జిరకాలంబు నటించుచుండు గవిరాజీగేహగంగంబులన్
                                                    (భీమ. 1-11)

    శ్రీనాధునిడెందముమెచ్చిన కవిత్వసందర్బ మిట్టిది.  శాస్త్రసంప్రదాయములు. భాషాసంప్రదాయాములు లోతుగా నెఱిగిన గాని యెఱుగరానిరచన లీతనికృతులలో దఱచుగా నుండును.  ఉపలబ్ధములయిన శ్రీనాధకృతు లన్నింటికంటె గాశీఖండము పరిణత మయినకవితాపాకము గలది.  ఈక్రీడాంబిరామరచనము దాని కీడుజోడుగా నున్నది.  శ్రీనాధుడు దీనిని భీమఖండ హరవిలాస రచనానంతరము కశీఖండరచనమునకు వెనుకనో ముందో రచియించియుండును.  హరవిలాసరచనము భీమఖండరచనముతర్వాత జరగెను.
    ఈ గ్రంధమందలి యీ క్రిందిపద్యము లతిప్రశస్తమయినవి.
           మంచన వింటివో, ఎకసక్కెముగ. కటిభారము, కమఠావతారము. కందుకకేళి, ఈమఱియింకనొక్కమఱి, సంచారించిన.