పుట:2015.333901.Kridabhimanamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ. హాలాహలం బనునల్లొనేరేడుపండు
         మిసిమింతుడును గాక మ్రింగినాడు
   పెనువ్రేలికొనగోర బిసరుహాసమునుమోము
       కెందమ్మివిరివోలె గిల్లినాడు (భీమ. 1-110)
     .... ..... ....
  చంద్రఖండములతో సరివచ్చుననవచ్చు
       విమలదంష్ట్రాప్రరోహములవాని
                           (ప్రబంధర. 131 పుట)
              ..... .... ....
   ఱవఱవ మండునెఱ్ఱణీఛండ్రమల్లెల
            చోద్యంపుగుండాలు పొచ్చువారు (క్రీడా. 142 వ)

     ఇట్టిచోట్ల ముందు ముచ్చట గొల్పునది పదచమత్కారము.  చక్కనిశయ్యతో నింత వింతపదములో సంతరింపుతో నర్ధంపుసొంపునుగూడ ననుగతపఱచుట శ్రీనాధుని కవనమందే కాననకుగును.  నన్నయాదు లగునాంధ్రకవీశ్వరుల రచనమ్లను సవిమర్శముగా జదువు సరసవిద్వాంసుల కెక్కువగా శ్రీనాధుని పద్యములుమాత్రమే జిహ్వ నూఱించును.  మఱపున బడకుండ మనసున నత్తుకొనియుండును.  నాల్కపై నాట్యమాడుచుండును.  శ్రీనాధునిశిష్యులయి యాతనిచరణముల బట్టుకొన్నతర్వాతికవులకృతులతోగూడ గొన్నింట నట్టి రచనలున్నవి.  శ్రీనాధునితర్వాతికవులకు బలువురకు శ్రీనాధునిరచనలు మెలుబంతులు.  పిల్లమఱ్ఱి పినవీరన,