పుట:2015.333901.Kridabhimanamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవితావిమర్శము

         శ్రీనాధు  డాంధ్రపద్యముల కబ్రపునిబ్బరపునడక నేర్చినవాడు.  శయ్యాసౌభాగ్య మాతనిరచనలలో సర్వత్ర యతిప్రాసమై సాగును.  నన్నయ, వాచనసోమన తొలుత నిట్టిత్రోవ ద్రొక్కిరి.  శ్రీనాధుడ్ దాని ఘంటాపధము గావించెను.  అన్నియర్హతలకంటె నధికముగా శయ్యాసౌభాగ్యమునే శ్రీనాధుడు చక్క జూచుకొనును.  ఈ క్రింది పద్యము జదువుడు.

శా. ఆకాశాందలవీధుల న్నిగిడె సంధ్యారాగరేఖావశుల్
     పాకోన్నిద్రిత పారిభద్ర పటలీ పాండిత్య వైతండికో
     త్సేక స్ఫూర్జిత చండ తాండవ రయోద్రేకారభ ట్యుదృట
     శ్రీకంఠ స్థిరకంఠ కోమల జటాశ్రేణి న్విడంబించుచున్
                                                   (భీమ. 2-32)

   శయ్యలిగింపేకాని యిం దర్ధంపుపొం పేమున్నది? ఆకాశాంచలవీధులందు సంధ్యారాగరేఖలు సాగినట్లే యీ పద్యము ప్రధమచరణమున బదరచన సాగినది.  తక్కిన చరణములును దానికి దగినట్లు నెగడినవి.  కొన్నిచోట్ల నిట్లున్నను నెన్నోచోట్ల శ్రీనాధుడు శ్రవణమాత్రముననే సంతోషము గొల్పజాలు గడుసరినుడికారములను సంస్కృతాంధ్రములలో జతపఱచి సరసార్ధముతో జతురరచనల నెఱపెను.