పుట:2015.333901.Kridabhimanamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనకధాపాత్రము అక్కడ కదుపార భుజించి యట వెడలి కొంత చనిరి. (మ్రొగలిపూలము పుష్పలాని గాన్మవచ్చెను.) అందు మన్మధామ్నాయవిద్యోపాధ్యాయము, ప్రతాపరుద్ర ధరిణీశోపాత్తగొష్టీప్రతిష్ఠాపారీణయు నగుమాచల్దేవి ప్రతాపరుద్రదేవుని 'గోష్టీప్రతిష్టాపారీణ ' యనియె కలదు గాని 'యుంపుడుకత్తె ' యని స్పష్టోక్తిలేదు. ప్రతాపరుద్ర దేవుడు తౌర్యత్రికప్రియుడు. ఆయనయాస్థానమున బలువురు నృత్తగీరవాద్యనిపుణులుండెడివారు. మాచల్దేవి తద్గోష్ఠిలో గొప్పప్రతిష్ఠ నందినది వానవచ్చును. ప్రతాపరుద్రనృపసార్వభౌముని వాళ్ళలో నేకశిలానగరమున మహైశ్వర్యసంపన్నురాలై మాచల్దేవి యని వేశ్య నిజముగా నున్నదో లేదో కాని మనశ్రీనాధకవిసార్వభౌమునినాళ్ళలో బెజవాడ నగరమున మహైశ్వర్యసంపన్నురాలై మాచల్దేవి యని వేశ్య యొక్కర్తె గలదు. ఆమె క్రీ.శ.1437 ప్రాంతముల బెజవాడ పాపవినాశనదేవరకును, రుద్రపాదములకును బహుగ్రామములందు దనకు జెల్లివచ్చుచున్నభూముల నెన్నీంటినో ధర్మముచేసినది.* ఈ విషయమును జెప్పు బెజవాడ


  • దక్షిణహిందూదేశ శాసనసంచయము 4 వాల్యుం 773 నెం. శాసనము చూచునది. చూ. అనుబంధము