పుట:2015.333901.Kridabhimanamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గడియారము గాదు) గలదనియు, నందు గంటలు గడియకొక్కటిచొప్పున మ్రోగుననియు దెలియనగును. మఱియు నానాటికే యానగరమున దురకలమసీదుగూడ వెలసినదని యెఱుగనగును. ఆమసీదు కాకతీయచక్రవర్తుల పాలితప్రజలలో దురుష్కులుగూడ నుండుటచే వారి భగవదారాధనార్ధ మాచక్రవర్తులచే బరమతాదరముబట్టి కట్టింపబడినదిగా దలపదగును గాని, తురుష్కులచే స్వవిజయచిహ్నముగా వెలయింపబడినదిగా దలపదగదు. ఏలనగా తురుష్కులానగరము నాక్రమించుకొన్నతర్వాత దాని కట్టి సౌభాగ్యమే లేదు. ఒక్క పెట్ట సర్వము దుడిచిపెట్టబడినది. ఆంధ్రోద్వీళు మోసాలమీద గంటలు మ్రోగుచుండుకాలమున దురుష్కులు విజయచిహ్నముగా నక్కడ మసీదు గట్టుట సందర్శింపదు.

 పూటకూటింటికి  మన కధాపాత్రము లరిగిరి.  పూటకూటిండ్లక్కడక్కడ నేడువోలె నాడును నాహారమునకే కాక విహారమునకు ననుపుగల్గియుండుట వింత.  కాని, నాడు రూక యిచ్చినచో కపరబోగి బియ్యపుసన్నన్నము, గోధుమపిండివంట, గుప్పెడు పంచదార, అప్పుడుగాచిన యావునేయి, పెసరబప్పు, కొమ్మునల్లనటి పండ్లు, నాల్గయిదు పచ్చళ్ళు, నూరుగాయలు, లప్పలతోడి కమ్మని పెరుగు గల దొడ్డబోజనము దొరకెడిదట!  నేడో ........ .!