పుట:2015.333901.Kridabhimanamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొన్నచెట్టెక్కి సంగీతముపాడెను. శిలలెల్ల మరల గోవులు గోపాలురు నయిరి. కామవల్లి కృష్ణగీతాలాపములకు జొక్కి దక్కి దక్కించుకొనగోరెను. కృష్ణుడు పరస్పరశావిధజ్ముల నెఱిగించెను. కామవల్లి విరహోద్వేగమున ముగుల దు:ఖించి ప్రార్దించెను. ఎపుడు నన్ను జూడగోరుదువో అపుడేల్ల నా యాకారరేఖ చూపుదును. దాన నీకు గొంత శాంతి కలుగగలదు. మఱియు నీయపతారమున భీష్మకనృపతికి నీయంశము రుక్మిణి యని జన్మించి నన్ను, బొందగలదు. దాన గొంత నీకు శాంతి గల్గును. మఱియు ధర్మదయావరు లయినయాస్తికులు నిన్నెలువేల్పుగా నర్చింప గలరు. వారి యర్చనలవలన గొంత శాంతి కలుగగలదు. వీనిచే మద్విరహవేదనాభరము నోర్వగలవు. నిన్నుగొల్చు చుండువారి కభీష్టము లొసగుచుండుము. మఱియు ధరణి పై నవివాహిత లగువధువుల నెల్ల నీవు పూనియుండుము. నేను పరులను బూనియుందును. వారిదాంపత్యమే మన దాంపత్య మగును. కల్క్యవతారమున దప్పక నన్ను నీవు పొందగలజ్వు" అని వరము లిచ్చెను. కామవల్లి యంశమున రుక్మిణి జనియించి శ్రీకృష్ణుని బొందెను. కామవల్లీమహా దేవి ధరణిపై డెబ్బదిరెండు స్థానముల కొలకులందు మహోత్సవము లందుచు వెలయుచున్నది. క్రీడాభిరామవర్ణనములు గూడ మీదికధనే సూచించుచున్నవి.