పుట:2015.333901.Kridabhimanamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సర్వేశ్వర్య్బు "నిదేమి వింత? వీరిట్లు కలుగ గారణమేమి?" యని గౌరి యడిగెను. శివుడు కధయెల్ల జెప్పెను. వీరిని గొనిపోయి పెంచుకొంద మని గౌరి కోరెను. వీరు మనమాట వినరు--

"ఒకరిపై మోహించి యూరక బ్రమసి
తికమకలను బొంది తిరుగుచుందురు
కోమలి యిటువంటృఇ కూరు లేమిటుకి
పోదము రమ్మన పురహరుం డపుడు
నువ్వంపుజీరెలు మంచిసొమ్ములును
పువ్వులు గంధకర్పూరంబు లొసగి."

       వారికి గాపుగా బోతురాజును సృజించి యట నిలిపి తా నరిగెను.  ఒక నాడు బ్రహ్మదేవు డాకొలనికి వచ్చి వారి స్థితుల నెఱింగి దాదెమ్మ యనునామెను వారి పోషణకై సృజించి పొతురాజునకు శాంతి పుట్టింపగా దగినయామెను కూనలమ్మను సృజించి యాపోతురాజునకు భార్యనుగా జేసెను.  ఆకొలనిదగ్గఱనే కసకావతీపుర మనునొకౌరము నిర్మించి యందు వారికి వలయు సర్వసౌకర్యముల నొడగూర్చెను.  వారందుండిరి.  ఇట్లు కొంతకాలము గడవగా కామవల్లి యొకనాడు శివునికొల్చున కరిగి తదనుగ్రహము వడసెను.  అప్పుడు

"ఆ పార్వతీశ్వరుం డతిసంభ్రమమున
నిరవొప్ప యక్షుల నిద్దఱ బిలిచి