పుట:2015.333901.Kridabhimanamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శివుడు గౌరిని బెండ్లాడెను. వారిర్వురు దాంపత్యసౌఖ్యముల నందుచు వినాయక వీరభద్ర కుమారాదుల గనిరి., గౌరి యొకనాడు దనకి బుత్త్రికాసంతాన మనుగ్రహింపు మని విభుని వేడెను. ఆమె వేడుక దీర్చ నొకనాడు శివి డామెతో గూడ లక్ష్మియున్నకొలన జలక్రీడ సల్పుచుండేను. పరస్పర విహారవిలాసక్లేశమున గౌరి యాకొలన నేడుదోసిళ్ల నీరు ద్ర్రవెను. లక్ష్మి యానీటితో గర్భమున బ్రవేశించెను. "సప్తక్రమంబుల జవిగొన్నకతన" నామెకు లక్ష్మి సప్తకన్యకలుగా సద్యోగర్భమున బుట్టేను.

"పొడవైన మెఱుగుల ప్రోవుచందమున
పెడతల జనియించె బెరవాణి యనగ
శిరమున జనియించె బెరవాణి యనగ
కొప్పున జనియించె కొండవా ణనగ
మొగమున జనియించె జక్కులమ్మనగ
కన్నె లార్గుగకును గడపట బొడమి
చిన్నారిపొన్నారి చెలియలై యపుడు
అన్నిట గొదలేని యాకారరేఖ
గన్నుల నుదయించె గామన ల్లనగ
ఇటువలె శ్రీలక్ష్మియేవురై పుట్టె
శర్వాణి నెఱుగంది సప్తకన్యకల--"