పుట:2015.333901.Kridabhimanamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీర్చ నుత్తరీయాంచలము నందుకొని వేడెను. రామచంద్రమూర్తి యేకాత్నీవ్రతుడ ననెను. అవతాతభేదమే కాని నీవు నాభర్తవే యని లక్ష్మీదేవి నిర్భందించెను. రామచంద్రమూర్తి గర్హించెను. నన్నిట్లీ యవతారమున దు:ఖపెట్టితివి గాన యింకొకయవతారము మెత్తి యిలువడి దప్పి గొల్లచేడెల గాళ్లవ్రేళ్ళబడి వేడికూడి జారుడని యాఱడి జడుదువుగాక యని యాదిలక్ష్మి రాంచంద్రమూర్తిని శపించెను. రాముడు ప్రతిశాప మిచ్చెను. "సరే కాని యానాడు నీవుగూడ ఆదిలక్ష్మి కామేశ్వరి యని పేర వెలసి నామీది మోహమున నవయుచునే యుండెదవు పొమ్ము" అని. ఆదిలక్ష్మి శ్రీ మహావిష్ణువుతో విన్నవించుకొనగా "నేను శ్రీకృష్ణావతార మందదను, నీవు శ్రీమహాదేవునకు బుత్త్రివై వెలసి మద్విరహక్లేశము నందగలవు. నేను కల్క్యవతార మందినప్పుడు మరల నీవు నన్ను బొందగలవు పొ"మ్మనియెను. శ్రీమహావిష్ణు కృష్ణావతార మందెను. ఆదిలక్ష్మి మహాతపనున నున్నశివి జేరంబోయి నన్ను బుత్రినిగా గాంచుకొన ననుగ్రహింపు మని వేడేను. శివుడు "నే నిప్పుడు మహాతపమున నుంటిని. గౌరిని బెండ్లాదిన పిదప నీవు నాకు బుత్రివై వెలయగలవు" అని యామె నొకకొలన నివసింపజేసెను. పిదప గొంతకాలమునకు